స్మాల్ శాంపిల్ : మహేష్ మైనపు విగ్రహం

ప్రిన్స్ మహేష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనుంది. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మహేష్ మైనపు విగ్రహం ఏర్పాటుకానుంది. ఈ బొమ్మను తీర్చిదిద్దుతున్న ఇవాన్‌ రీస్‌ అభిమానులకు ఆ అనుభూతిని కొద్దిగా రుచి చూపించారు. ఇందుకు సంబంధించిన ప్రతిమను గురువారం (జూలై-26) ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.  ఈ ఏడాది ఏప్రిల్‌ 28న మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు ప్రతిమ ఏర్పాటు చేయనున్నారని, అందుకోసం తన కొలతలు తీసుకున్నారని మహేష్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ తో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే మ్యూజియంలో అభిమానులకు మహేష్ కనిపిస్తాడన్నమాట.

Posted in Uncategorized

Latest Updates