స్మిత్ ఔట్ : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా రహానే

smithఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా రహానే ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా ప్లేయన్ స్టీవ్ స్మిత్ తప్పుకోవడంతో కెప్టెన్ గా రహానే నియామకమయ్యారు.

బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డిన స్టీవ్ స్మిత్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. BCCI ఆదేశాలతో స్మిత్ కెప్టెన్సీపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇంత‌కుముందే రాజ‌స్థాన్ టీమ్ చెప్పింది. ఇందులో భాగంగా స్మిత్ త‌న‌కు తానుగా కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. సౌతాఫ్రికాలో జ‌రిగిన ఘ‌ట‌న నిజంగానే పెద్ద త‌ప్పిద‌మ‌ని.. క్రీడా స్పూర్తి, స‌మ‌గ్ర‌త‌కు క‌ట్టుబ‌డే స్మిత్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడని ప్రకటించింది రాజస్థాన్ రాయ‌ల్స్ టీమ్. బోర్డు ప్రవర్తనా నియమావళి ప్రకారం.. మోసం చేసినందుకు స్మిత్‌ను గరిష్టంగా జీవితకాల నిషేధించే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates