స్వచ్చ ర్యాంకుల్లో ఫస్ట్ ఫ్లేస్ ఇండోర్ దే : సాయిల్డ్ వెస్ట్ మేనేజ్ మెంట్లో హైదరాబాద్ నెం.1

CBస్వచ్ సర్వేక్షన్- 2018 అవార్డులను ప్రకటించింది స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ్ ర్యాంకింగ్ లో  ఫస్ట్ ప్లేస్ ఇండోర్ నగరం దక్కించుకుంటే.. రెండు, మూడు స్థానాలను భూపాల్, చండీగడ్ దక్కించుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కు స్వచ్ఛ ర్యాంకింగ్ లో 27వ స్థానం దక్కింది. సాయిల్డ్ వెస్ట్ మేనేజ్ మెంట్లో మాత్రం దేశంలోనే ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది హైదరాబాద్. ఇండోర్ లో జరిగిన స్వచ్ అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అందజేశారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో స్వచ్ఛ ర్యాంకులను ప్రకటించింది స్వచ్చ భారత్ మిషన్. 2018 స్వచ్ఛ ర్యాంకుల్లో మరోసారి ఇండోర్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. మొత్తం 4 వేల మార్కులకు 3,707 మార్కులు సాధించి ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. 2017లో 434 నగరాలు స్వచ్ సర్వేక్షన్ లో పోటీ పడితే.. ఈసారి మాత్రం 4041 నగరాలు పోటీపడ్డాయి. రెండో స్థానంలో భోపాల్, మూడో స్థానంలో చండీగఢ్, నాలుగో స్థానంలో న్యూఢిల్లీ ఉంటే..5వ స్థానంలో విజయవాడ నిలిచింది. తిరుపతికి 6, మైసూర్ 8, పుణేకి 10వ స్థానం దక్కింది. 3092 మార్కులు సాధించిన హైదరాబాద్  27వ ర్యాంక్ లో నిలిచింది. సాయిల్డ్ వేస్ట్ మేనేజ్ మెంట్లో మాత్రం ఫస్ట్ ప్లేస్ సాధించింది.  స్వచ్ఛ అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ అవార్డును మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి అందుకున్నారు. సాయిల్డ్ వెస్ట్ మేనేజ్ మెంట్ లో కూడా అవార్డు తీసుకున్నారు.

కోటికిపైగా జనాభా ఉన్న కార్పొరేషన్ల లో గ్రేటర్ ముంబై తర్వాత జీహెచ్ఎంసీ స్వచ్ఛనగరంగా నిలిచింది. 2015లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ లో 476 నగరాల్లో సర్వే నిర్వహించగా బల్దియాకు 275వ స్థానం లభించింది. 2016లో 73 నగరాల్లో సర్వే నిర్వహించగా జీహెచ్ఎంసీ 19వ స్థానంలోనూ, 2017లో 434 నగరాలకు నిర్వ హించిన సర్వేలో హైదరాబాద్ కు 22వ స్థానం లభించింది. ప్రస్తుతం 2018 స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం మూడు విభాగాలకు కలిపి 4,000 మార్కులకుగాను నిర్వహించిన సర్వేలో బల్దియాకు 3,092 మార్కులు వచ్చాయి. రాష్ట్రస్థాయి అభివృద్దిలో 1400 మార్కుల కుగానూ 973 లభించగా, స్వచ్ఛతపై నగరవాసుల నుంచి స్పందనకు కేటాయించిన 1400 మార్కుల్లో 942 లభించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి స్వచ్ సర్వేక్షన్ పోటీల్లో నగరాల సంఖ్య పెరగడంతో మెట్రో పాలిటన్ సిటీల ర్యాంకులు తారుమారయ్యాయి. మరోవైపు వచ్చే ఏడాది స్వచ్ సర్వేక్షణ్ కోసం ఇప్పటికే బల్దియా కసరత్తు మొదలు పెట్టింది.

Posted in Uncategorized

Latest Updates