స్వచ్ఛ్ సర్వేక్షన్ 2018: తెలంగాణకు రెండు అవార్డులు

swachస్వచ్ఛ్ సర్వేక్షన్ 2018 సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణను రెండు అవార్డులు దక్కాయి. ఘనవ్యర్థాల నిర్వహణలో రాష్ట్రాల రాజధానుల లిస్టులో హైదరాబాద్‌కు మొదటి స్థానం లభించింది. లక్షకు పైగా జనాభాగల పట్టణాల జాబితాలో ఉత్తమ పట్టణంగా సిద్దిపేటకు అగ్రస్థానం దక్కింది. ఇండియాలోనే పరిశుభ్రమైన నగరాల లిస్టులో ఇండోర్‌ మొదటి స్థానంలో నిలవగా.. భోపాల్‌కు రెండో స్థానం.. చండీగఢ్‌కు మూడో స్థానం లభించింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరం విజయవాడ… అత్యంత పరిశుభ్రమైన అతిపెద్ద నగరంగా ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో… ఉత్తమ నగరంగా… తిరుపతి ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది.

Posted in Uncategorized

Latest Updates