స్వచ్ఛ సర్వేక్షణ్‌ : చెత్త ఊడ్చి హైదరాబాద్ గిన్నిస్ రికార్డ్

nayaniస్వచ్ఛత విషయంలో హైదరాబాద్ మహానగరాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉంచుదామన్నారు మంత్రి కేటీఆర్. నగరంలోని రాంనగర్ డివిజన్‌లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం ఉదయం 15వేల 320 మంది విద్యార్థులు.. ఏకకాలంలో VST నుంచి సుందరయ్య పార్క్ వరకు వీరంతా చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు.

2017లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భారత్ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కిందన్నారు మంత్రి కేటీఆర్. అదే స్ఫూర్తితో ఈ ఏడాదికి సంబంధించి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. స్వచ్ఛ భారత్ ప్రారంభం కంటే ముందే.. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కింద నగరాన్ని 400 యూనిట్లుగా విభజించి..GHMC సహకారంతో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎప్పుడు కృషి చేస్తున్నామని  తెలిపారు. హైదరాబాద్‌లో కోటి జనాభా ఉంది. 22 వేల మంది పారిశుధ్ధ్య కార్మికులు నగరాన్ని క్లీన్ చేస్తే సరిపోదన్న మంత్రి కేటీఆర్.. మన ఇంటిలోనే తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని సూచించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, GHMC కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వివిధ కాలేజీ నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు.GHMC కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates