స్వర్ణం కోసం భారత మహిళల మధ్య పోటీ

saina-sindhuభారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధూ ఒకే కోర్టులో స్వర్ణం కోసం పోటీ పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21 కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో ఈ ఇద్దరూ మరోసారి తలపడుతున్నారు. మహిళల బాడ్మింటన్ విభాగంలో ఇవాళ సైనా, సింధూ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. ఇద్దరూ గెలిచినా ఓడినా ఈ రెండు పతకాలు భారత్ ఖాతాలోనే పడతాయి. మరోవైపు పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్ కూడా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ముగ్గురూ ఇప్పటికే పతకాలు ఖాయం చేసుకోవడంతో.. రేపు జరిగే ఫైనల్స్ భారత బాడ్మింటన్ అభిమానులందరికీ కన్నుల పండువగా ఉంది.

2010లో బంగారు పతకం సాధించి సంచలనం సృష్టించిన సైనా… గాయాల కారణంగా 2014 గ్లాస్గో కామన్వెల్త్‌లో నిరాశగా వెనుతిరిగింది.  అయితే మళ్లీ పుంజుకుని తాజా కామన్వెల్త్ పోటీల్లో తనదైన శైలిలో ఫైనల్స్‌లోకి చేరింది. స్కాట్‌ల్యాండ్‌ క్రీడాకారిణి క్రిస్టీ గిల్మోర్‌పై 21-14, 18-21, 21-17 తేడాతో విజయం సాధించింది. ఇక గత కామన్వెల్త్ పోటీల్లో కాంస్య పతకం నెగ్గిన పీవీ సింధూ ఇవాళ కెనాడా క్రీడాకారిణి మిచెల్లీ లీపై 21-18, 21-8 తేడాతో తిరుగులేని విజయం సాధించి ఫైనల్స్ కు వచ్చింది. ఇక స్వర్ణం కోసం సైనా, సింధూల మధ్యనే పోటీ జరుగనుంది.

Posted in Uncategorized

Latest Updates