స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

శంషాబాద్ మండల్ ముచ్చింతల్ లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ  మేళా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్  నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం ట్రస్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లా డుతూ ఇంటర్మీడియేట్ ఎంపీసీ లేదా బైపీసీ పాసైన నిరుద్యోగులు దీనికి అర్హులన్నారు. 24న స్వర్ణ భారత్ ట్రస్ట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దీనిని నిర్వహిస్తామని తెలియజేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లో ఫార్మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిం చున్నారు.ఉద్యోగ మేళాలో 60 శాతం మార్కులతో, 18నుం చి 21 సంవత్సరాల వయస్సు ఉండాలని స్వర్ణ భారత్ ట్రస్ట్ యజమాన్యం తెలియజేసింది. మరింత సమాచారం కోసం 9346651091,040 23471471 సంప్రదిం చాలని తెలిపారు.

Latest Updates