స్వలింగ సంపర్కం కేసు : చేతులెత్తేసిన కేంద్రం.. కోర్టు తీర్పే ఫైనల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న స్వలింగ సంపర్కం కేసుపై కేంద్రం ఎటూ తేల్చలేకపోయింది. స్వలింగ సంపర్కం చేస్తే నేరమా..కాదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే దీనిపై లేటెస్ట్ గా తన నిర్ణయాన్ని వెల్లడించింది కేంద్రం. స్వలింగ సంపర్కం అంశంపై తాము ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని, సుప్రీంకోర్టు విచక్షణకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని సుప్రీంకు తెలిపింది కేంద్రం.

స్వలింగ సంపర్కం నేరమా కాదా అన్న అంశంపై బుధవారం (జూలై-11) సుప్రీంకోర్టులో  వాదనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్టికల్ 377ను రద్దు చేయాలంటూ పెట్టుకున్న అభ్యర్థనలపై సుప్రీం సీనియర్ జడ్జిలు విచారణ చేపడుతున్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం ఒకవేళ ఎవరైనా స్వలింగ సంపర్కానికి పాల్పడితే వాళ్లకు జీవిత కాల జైలు శిక్షను విధిస్తారు.
రెండవ రోజు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తుషార్ మెహత తన అభిప్రాయాన్ని వినిపించారు. స్వలింగ సంపర్కం కేసులో కోర్టు విచక్షణకే నిర్ణయాన్ని వదిలేస్తున్నామన్నారు. ఆ సమయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా స్పందించారు. 377 ఆర్టికల్ ప్రకారం స్వలింగ సంపర్కం నేరమనా లేక దాన్ని నేరంగా పరిగణించరాదు అన్న నిర్ణయాన్ని తమకే వదిలేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. 2013లో కోర్టు ఇచ్చిన తీర్పును మాత్రమే పరిశీలిస్తామని సోమవారం (జూలై-9)ధర్మాసనం తన అభిప్రాయాన్ని వ్యక్తం విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates