స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే

స్వాతంత్య్రం తెచ్చింది ..తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో జాతీయ జెండా ఎగురవేసిన ఉత్తమ్. వేలాది కాంగ్రెస్ నాయకుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్య్రమన్నారు. ప్రజాఅభిప్రాయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. ఆరేళ్లలో తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు.

రాష్ట్రంలో దళితులు బడుగు, బలహీన వర్గాలపై అనేక దాడులు జరిగాయన్నారు. దళితులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతం సామాజిక తెలంగాణ అన్నారు. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగితే ఊరుకోబమన్నారు.  నీటి కేటాయింపుల విషయంలో ప్రస్తుత పాలకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.

జీహెచ్ ఎంసీ  ఎన్నికలు షెడ్యుల్ కంటే ముందే జరిగే అవకాశముందన్నారు. అధికార పార్టీ హడావుడి చూస్తే అలానే ఉందన్నారు. కేటీఆర్ అభివృద్ధి పనులంటూ హడావిడి చేస్తున్నడన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. రేపటి నుంచే GHMC ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు

Latest Updates