స్వామియే శరణం : శబరిమల ఆలయంలోకి ఎవరైనా వెళ్లొచ్చు

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకూ అయ్యప్ప ఆలయంలోకి మహిళలు రావడంపై ఉన్న నిషేధంపై ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అయ్యప్ప ఆలయంలోకి ఎవరైనా వెళ్లొచ్చని తెలిపింది. మహిళలు కూడా దేవుని సృష్టే అని సుప్రీంకోర్టు జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. మహిళలపై వివక్ష రాజ్యాంగ విరుద్దమని కోర్టు అభిప్రాయపడింది. 10 ఏళ్ల వయస్సు నుంచి 50 ఏళ్ల వయస్సు గల మహిళలు గుడిలోకి రావడంపై సంప్రదాయంగా కొనసాగుతున్న నిషేధానికి పుల్ స్టాప్ పెట్టాలని సుప్రీం తెలిపింది.

మహిళలు అనే కారణంతో ప్రవేశానికి నిరాకరించటాన్ని తప్పుబట్టింది. మహిళలతోపాటు ఎవరైనా అయ్యప్ప ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించవచ్చని.. స్వామి దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. 50 ఏళ్లలోపు మహిళలకు ప్రవేశం లేదు అని చెప్పటాన్ని తప్పుబట్టింది. ఇది భక్తుల మనోభావాలకు విరుద్ధం అని వెల్లడించింది. కోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఆలయ బోర్డుపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. గతంలోనూ మకర జ్యోతి విషయంలో కోర్టు ఆదేశాలతో కమిటీ విచారణ చేసింది. ఆ తర్వాతే జ్యోతి అనేది ఆలయ బోర్డు కృత్రిమంగా వెలిగించే కాగడా అని తేలింది. ఇప్పుడు మహిళల ప్రవేశంపైనా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించటంపై ఎన్నో పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణ చేసిన కోర్టు.. దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపింది. సుదీర్ఘ విచారణ తర్వాత.. మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు…

 

Posted in Uncategorized

Latest Updates