స్వామివారికి అపచారం జరుగుతోంది: రమణ దీక్షితులు

RAMANAటీటీడీ  మాజీ  ప్రధాన  అర్చకులు  రమణ  దీక్షితుల  విమర్శలు.. ఆరోపణలు  ప్రకంపనలు  సృష్టిస్తున్నాయి.  తిరుమలలో  శ్రీవారికి అపచారం  చేస్తున్నారంటూ.. తన ఆరోపణలను  కంటిన్యూ  చేస్తున్నారు  రమణ  దీక్షితులు.  దీంతో  ఆరోపణలపై స్పందించారు  టీటీడీ  EO  అనిల్ కుమార్  సింఘాల్.  ఆగమశాస్త్రం  ప్రకారమే  శ్రీవారికి  కైంకర్యాలు జరుగుతున్నాయన్నారు.  ఆభరణాలన్నీ  భద్రంగా  ఉన్నాయన్నారు.

తిరుమలలో జరుగుతున్న అపచారాలను ప్రశ్నించినందుకే.. తనపై కొందరు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు. హైదరాబాద్ వచ్చిన ఆయన.. మరోసారి తిరుమల దేవస్థానంలో స్వామికి అపచారం జరుగుతోందని విమర్శించారు. స్వామికి ఆగమశాస్త్ర ప్రకారమే పూజాధికాలు జరగాలన్నారు రమణ దీక్షితులు. 1150 సంవత్సరం నుంచి శ్రీవారికి నైవేద్యం ఈశాన్యంలోని వంటశాలలో తాయారు చేశారని.. గత 25 రోజులుగా బయట నైవేద్యాలను దేవుడికి సమర్పిస్తున్నారని ఆరోపించారు.

రమణ దీక్షితులు ఆరోపణలపై స్పందించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్. శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయన్నారు. ఆలయంలో రహస్యంగా ఏం జరగటం లేదన్నారు. శ్రీవారి ఆభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయని తెలిపారు.

రమణ దీక్షితులు ఆరోపణలను వ్యతిరేకించారు టీటీడీ పురోహితులు. ఆగమం ప్రకారమే కైంకర్యాలు జరుగుతున్నాయన్నారు. శ్రీవారిని పస్తులు పెట్టారంటూ ఆరోపించటం సరికాదన్నారు. రమణ దీక్షితులుపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.

తిరుమలలో అర్చకుల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటంపై భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates