స్వీడన్ లో మోడీకి ఘన స్వాగతం

MODIఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఘనస్వాగతం లభించింది. స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో మోడీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లోఫెన్. స్వీడన్ లోని ఇండియన్స్ మోడీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మోడీ వెల్ కమ్ అంటూ స్వాగతం పలికారు. వారితో చేతులు కలుపుతూ ముందుకు సాగారు ప్రధాని. ఇక మంగళవారం (ఏప్రిల్-17) ఇండియా నార్డిక్ సదస్సులో పాల్గొంటారు మోడీ. నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ , డెన్మార్క్, ఐస్ లాండ్ పాల్గొనే సదస్సులో మాట్లాడతారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. తర్వాత బ్రిటన్ కు వెళ్లనున్నారు మోడీ. రేపు, ఎల్లుండి జరిగే 52 సభ్య దేశాలైన చోగం సదస్సులో పాల్గొంటారు. ముఖ్యంగా లండన్ లోని చారిత్రక సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్స్ నుంచి మోడీ ప్రసంగిస్తారని తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates