హంస, చిలుక వాహనాల‌పై కాళహస్తీశ్వరుడు

sriశ్రీకాళ‌హ‌స్తిలో శివ‌రాత్రి బ్ర‌హోత్స‌వాలు వైభవంగా జ‌రుగుతున్నాయి. ఆదివారం(ఫిబ్రవరి-11) స్వామి, అమ్మ‌వార్ల‌ను హంస‌, చిలుక వాహ‌నాల‌పై పుర‌వీధుల్లో ఊరేగించారు. మొద‌టిసారిగా దాత‌లు ఇచ్చిన స్వ‌ర్ణ వాహ‌నాల‌పై ఊరేగుతూ స్వ‌ర్ణ‌కాంతుల‌తో ద‌గ‌ద‌గ‌లాడుతూ భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. భ‌క్తుల శివ‌నామ‌స్మ‌ర‌ణ‌, మంగ‌ళ‌వాయిద్యాలు, వేద‌పండితుల మంత్రో చ్ఛారణల  మ‌ధ్య స్వామివారి ఊరేగింపు క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది.

 

Posted in Uncategorized

Latest Updates