హజ్ యాత్రికులకు శుభవార్త: 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ

హజ్ కు వెళ్లాలనుకునే ముస్లింలకు శుభవార్త. వచ్చే ఏడాది హజ్ కు వెళ్లాలనుకునే వారు అక్టోబర్.15 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని హజ్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ మసీవుల్లా ఖాన్ తెలిపారు. ప్రతీ ఏడాది నవంబర్ లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. అయితే ఈ సారి నెల రోజుల ముందు నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.

కేంద్ర హజ్ కమిటీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం త్వరలోనే విడుదల చేస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates