హడావిడి బాగా చేస్తున్నారు : సచిన్ కొడుకు వికెట్ తీశాడు

తెగ చింపేస్తున్నారు సెలబ్రిటీలు.. అదరహో అంటూ ఊదరగొడుతున్నారు.. భారతదేశ యువతకే ఆదర్శం అన్నట్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.. ఇవన్నీ సామాన్యుడి గురించి కాదు.. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ సాధించిన విజయం గురించి. ఇంతకీ ఏం చేశాడో తెలుసా..

కొలంబో వేదికగా జరుగుతున్న అండర్-19 టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఫస్ట్ వికెట్ తీయటం. మంగళవారం (జూలై-17) శ్రీలంక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. రెండో ఓవర్ లోనే ఫస్ట్ వికెట్ తీసి ఆకట్టుకున్నాడు అర్జున్. కెరీర్ లో వేసిన 12వ బంతికే తొలి వికెట్ తీశాడు. ఈ లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్.. తన రెండో ఓవర్ చివరి బాల్ కి లంక బ్యాట్స్‌ మన్ కామిల్ మిషారాను LBWతో పెవిలియన్ పట్టించాడు.

లంక కెప్టెన్ నిపున్ ధనంజయ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇండియన్ కెప్టెన్ అనూజ్ రావత్.. అర్జున్ టెండూల్కర్‌ తో బౌలింగ్ ప్రారంభించాడు. రెండో ఓవర్ ఐదో బంతికి ఫోర్ ఇచ్చిన అర్జున్.. చివరి బంతికి వికెట్ తీశాడు. ఇండియా 64 ఓవర్లు వేసి.. 8 వికెట్లు తీసి.. 231 పరుగులు చేసింది. ఆయుష్ బజోనీ, అర్ష్ త్యాగీ చెరో మూడు వికెట్లు తీసిన కనీసం ఎవరూ పట్టించుకోలేదు.. ఒక్క వికెట్ తీసిన సచిన్ టెండూల్కర్ కుమారుడికి మాత్రం సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వీరతాడులు వేస్తున్నారు. చెరో మూడు వికెట్లు తీసిన కుర్రోళ్లు కూడా ఫస్ట్ టైం అండర్ 19 టెస్ట్ మ్యాచ్ లకు ఎంపిక అయినవారే.. వారు కూడా క్రికెట్ లో అరంగేట్రం చేసినోళ్లే…

 

Posted in Uncategorized

Latest Updates