హత్య కేసులో….యోగీకి కోర్టు నోటీసులు

19 నాటి హత్య కేసులో… యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు మహారాజ్ గంజ్ సెషన్స్ కోర్టు మంగళవారం(సెప్టెంబర్-25) నోటీసులు జారీ చేసింది. 1999లో అప్పటి ఎస్పీ లీడర్ తలత్ అజీజ్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసే సత్య ప్రకాశ్ యాదవ్ హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసింది.
1999 ఫిబ్రవరి-10న మహారాజ్ గంజ్ జిల్లాలో సమాజ్ వాదీ పార్టీ జైల్ భరో ఆందోళన నిర్వహించిన సమయంలో ఆందోళనల్లో ఓ బృందం జరిపిన కాల్పుల్లో సత్య ప్రకాశ్‌ చనిపోయాడు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బృందం ఆ కాల్పలు జరిపినట్లు కేసు నమోదైంది.
ఈ కేసుపై విచారణను తిరిగి ప్రారంభించాలని కోరుతూ అజీజ్ దాఖలు చేసిన పిటిషన్‌ ను ఈ ఏడాది మార్చిలో సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు అజీజ్. హైకోర్టు కేసు తిరిగి తెరవాలని సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. దీంతో మహారాజ్‌ గంజ్‌ లోని సెషన్స్‌ కోర్టు ఈ కేసును తిరిగి ఓపెన్‌ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం యోగి ఆదిత్యనాథ్‌ సహా ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తన వాదనను వినిపించేందుకు యోగికి ఓ వారం గడువు ఇచ్చింది కోర్టు.

Posted in Uncategorized

Latest Updates