హత్య కేసులో రాంపాల్ బాబాకు యావజ్జీవ కారాగారం

హర్యానా : హత్య కేసులో రాంపాల్ బాబాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది హర్యానాలోని హిసార్ కోర్టు. అతడితో పాటు.. మరో 14మందికి కూడా శిక్షలు వేసింది. 2014లోనే అరెస్టై హర్యానా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాంపాల్ బాబా కోసం సెంట్రల్ జైలులోనే తాత్కాలిక కోర్టు ఏర్పాటుచేసి విచారణ జరిపారు. రాంపాల్ బాబాపై రెండు మర్డర్ కేసులు ఉన్నాయి. వారం రోజుల కిందటే ఓ హత్య కేసులో రాంపాల్ బాబాను దోషిగా తేల్చింది కోర్టు. ఇవాళ(అక్టోబర్ 16) న శిక్షలు ఖరారు చేసింది.

2014లో జరిగిన హత్యలకు సంబంధించిన కేసులో తాజాగా తీర్పు చెప్పింది కోర్టు. 2016లో జరిగిన మరో హత్య కేసులో శిక్షను రేపు(అక్టోబర్ 17) న చెప్పనుంది. 2014లో హర్యానాలో రాంపాల్ కు చెందిన సత్లోక్ ఆశ్రమం పరిసరాల్లో… అతడి అనుచరులకు.. పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇదే సందర్భంలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి చనిపోయారు. 2006లో ఓ మహిళ హత్య కేసులోనూ దోషిగా ఉన్నాడు రాంపాల్. అతడిపై ఇప్పటికే సెక్షన్ 302 మర్డర్, సెక్షన్ 120(బి) క్రిమినల్ కాన్సైరసీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మొదటి కేసులో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది హిసార్ లోని కోర్టు.

రాంపాల్ సింగ్ జతిన్ ఈ బాబా అసలు పేరు. 1951లో పుట్టిన రాంపాల్… మొదట హర్యానా ఇంజినీరింగ్ డిపార్టుమెంట్లో ఉద్యోగిగా పనిచేశాడు. హిందూమతం వదిలేసి స్వామీజీ అవతారం ఎత్తాడు. కబీర్ పంత్ ప్రవచనాలు చెబుతూ… హర్యానా రోహ్తక్ లో సత్లోక్ ఆశ్రమాన్ని ఏర్పాటుచేశాడు. హత్య చేశారన్న ఆరోపణలపై కోర్టు ఆదేశాలతో… నవంబర్ 19, 2104లో పోలీసులు ఉద్రిక్త వాతావరణంలో రాంపాల్ ను అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టు ఆయనకు శిక్షలు వేసింది.

Posted in Uncategorized

Latest Updates