హనుమంతుడు జాట్ : యూపీ మంత్రి హాట్ కామెంట్

ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ నేతలు హనుమంతుడిపై రోజురోరకమైన వాదనలు చేస్తున్నారు. ఆ మధ్య యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హనుమంతుడు ఎస్సీ అని చెప్పారు. అప్పట్లోనే ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది. నిన్న గురువారం రోజున బీజేపీ ఎమ్మెల్సీ బుక్కాల్ నవాబ్ … హనుమంతుడు ముస్లిం అంటూ వివాదాస్పద కామెంట్ చేశారు. హన్మాన్ అనేది ముస్లింలకు పెట్టే పేర్లకు దగ్గరగా ఉందని.. అందుకే హనుమంతుడు ముస్లిం అనేది ఆయన వాదన. ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ మంత్రి హనుమంతుడికి కులం ఆపాదిస్తూ… మరో కామెంట్ చేశారు.

హనుమంతుడు జాట్ వర్గానికి చెందిన వాడని యూపీ మంత్రి  చౌదరి లక్ష్మినారాయణ అన్నారు. సాటివాడు కష్టాల్లో ఉంటే జాట్లు ముందూవెనకా ఆలోచించకుండా… తనవాడా పరాయివాడా అనేది కూడా ఆలోచించకుండా సహాయం చేయడానికి వెళ్తారని.. ఈ లక్షణాలున్న ఆంజనేయుడు కూడా జాట్ వర్గానికి చెందినవాడే అనేది ఆ మంత్రి చెప్పిన వివరణ.

నాయకుల మాటలు ఎలా ఉన్నా… దేవుళ్లకు కుల,మతాలను వర్తింపజేయడం ఎంతవరకు  కరెక్ట్ అనేది సామాన్యుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఇలాంటి కామెంట్స్ చేసే నాయకుల కారణంగానే.. బీజేపీ ప్రతిష్ట దిగజారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హనుమంతుడు ముస్లిం : యూపీ బీజేపీ ఎమ్మెల్సీ

Posted in Uncategorized

Latest Updates