హనుమంతుడు ముస్లిం : యూపీ బీజేపీ నేత

యూపీ : హనుమంతుడు ముస్లిం అంటూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు ఉత్తరప్రదేశ్ BJP ఎమ్మెల్సీ బుక్కాల్ నవాబ్. హనుమాన్ దళితుడు అంటూ ఇటీవల యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించినప్పుడు పెద్ద దుమారం రేగింది. ఇదే విషయంపై తాజాగా బుక్కాల్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీని మరో మలుపు తిప్పాయి.

తన దృష్టిలో హనుమంతుడు ముస్లిం అని… దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని వివరించారు బుక్కాల్ నవాబ్. రహమాన్, రంజాన్, ఫర్మాన్, జిషాన్, కుర్బాన్, రైమ్, ఇమ్రాన్, ఫుర్ఖాన్, సుల్తాన్, సులేమాన్ వంటి ముస్లిం పేర్లతో హనుమాన్‌ కు ప్రాస కుదురుతుందని … అందుకే… హనుమాన్ ముస్లిం అనేది తన అభిప్రాయమని చెప్పారాయన. ఐతే…. దేవుళ్లకు కులాలు, మతాలు ఆపాదిస్తూ.. స్టేట్ మెంట్లు ఇస్తున్న వారిపై మండిపడుతున్నారు నెటిజన్లు.

 

 

Posted in Uncategorized

Latest Updates