హమాలీల చార్జీలు పెంచిన ప్రభుత్వం

etalaతెలంగాణ పౌరసరఫరాల శాఖలో హమాలీ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు హమాలీ సంఘాలు ప్రకటించాయి. పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీలు 24 డిమాండ్లతో సమ్మెకు దిగారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలతో కమిషనర్‌ అకున్‌ సభర్వాల్‌ హమాలీ సంఘాలతో చర్చలు జరిపారు. గురువారం(జూన్-21) హమాలీ సంఘాలతో సమీక్షించిన మంత్రి.. ప్రధాన డిమాండ్‌ అయిన చార్జీలను పెంచాలని నిర్ణయించారు.

హమాలీల చార్జీలను గతం కంటే రూ.3 అదనంగా పెంచుతున్నామన్నారు మంత్రి  ఈటల. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హమాలీ చార్జీలను క్వింటాలుకు రూ.8 నుంచి రూ.12కు, 2016లో రూ.15కు పెంచిందన్నారు.

ప్రస్తుతం పెరిగిన చార్జీలతో గ్రామీణ ప్రాంతాల్లో క్వింటాలుకు రూ.18, పట్టణ ప్రాంతా ల్లో రూ.18.50 హమాలీలకు అందనుంది. దసరా బోనస్‌ను రూ.4వేల నుంచి 4,500కు, చనిపోయిన కార్మికుని దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల హమాలీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

 

Posted in Uncategorized

Latest Updates