హరహర మహాదేవ్ : ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

amarహిందువులు పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మంగళవారం (జూన్-26) అర్థరాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. జమ్మూ బేస్ క్యాంపు నుంచి …తొలివిడత బ్యాచ్ దర్శనానికి బయలుదేరింది. వందలాది మంది అమర్ నాథ్ యాత్రికులు అనేక వాహనాల్లో బయలుదేరారు. ఈ యాత్రను జమ్మూకశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీబీ వ్యాస్, గవర్నర్ ముఖ్య సలహాదారు విజయ్ కుమార్… జెండా ఊపి ప్రారంభించారు. జమ్మూ బేస్ క్యాంపు వద్ద పర్యాటకులు మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. ఉగ్రవాదుల దాడులు పొంచి ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో …అమర్ నాథ్ యాత్రకు భారీ భద్రత కల్పించారు అధికారులు. అమర్ నాథ్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు గవర్నర్ ముఖ్య సలహాదారు విజయ్ కుమార్. ఏటా ఉత్సవంలా జరిగే ఈయాత్రకు ప్రజలు, సెక్యూరిటీ ఏజెన్సీ సహకరించాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates