హరహర మహాదేవ : గల్ఫ్ లోని శివాలయంలో మోడీ పూజలు

Modi_temple12_2018విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ రోజు ఉదయం (ఫిబ్రవరి 12) ఓమన్ దేశం ఓల్డ్ మస్కట్ లోని 125 సంవత్సరాల పురాతన శివాలన్ని సందర్శించారు. శివాలయంలో ప్రధాని మోడీ పూజలు చేశారు. అనంతరం ఆలయం బయట భారత కమ్యూనిటీ ప్రజలను మోడీ కలుసుకున్నారు. ఈ శివాలయం గల్ఫ్ రీజియన్ లోనే పురాతన ఆలయాల్లో ఒకటి. ఒమెన్ సుల్తాన్ ప్యాలెస్ ప్రాంతంలో ఇది ఉంది. 125 సంవత్సరాల క్రితం గుజరాల్ కు చెందిన మర్చెంట్ కమ్యూనిటీ ఈ ఆలయాన్ని నిర్మించింది. 1999లో ఈ ఆలయాన్ని పునర్మించారు. పండుగలు, పర్వదినాల సందర్భంలో ఈ ఆలయానికి 15వేల మందికి పైగా భక్తులు వస్తారని అక్కడి పూజారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates