హరితహారంపై కీలక సమావేశం

హరితహారంపై అరణ్యభవన్‌లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు, సీఎం కార్యాలయం, అటవీశాఖ ఉన్నతాధికారులు, పారిశ్రామిక సంస్థల యజమానులు, ప్రతినిధులు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ ఆకుపచ్చని దిశగా అడుగులు వేస్తుందని ప్రశంసించారు పారిశ్రామికవేత్తలు. హైదరాబాద్, శివారు పారిశ్రామికవాడల్లో విరివిగా మొక్కలను పెంచాలని నిర్ణయించారు. సామాజిక బాధ్యతలో భాగంగా కొన్ని ప్రాంతాలు దత్తత కోసం పరిశ్రమలకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. దత్తత ప్రాంతాల్లో మొక్కల పెంపకం, రక్షణ చేపట్టాలని సూచించింది ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates