హరితహారంపై దూలపల్లి ఫారెస్ట్ అకాడమిలో.. అవగాహన సదస్సు

హరితహారంపై రెండ్రోజుల పాటు అధికారులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు సీఎస్ ఎస్. కె జోషి. అటవీ, విద్యాశాఖ నుంచి ముగ్గురు.. ప్రతీ జిల్లా నుంచి ఆరుగురు అధికారులకు జూలై 26, 27న దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అధికారులు జిల్లాల్లో, మండలాల్లో మిగతా వారికి అవగాహన కల్పిస్తారని తెలిపారు సీఎస్. హరితహారం కొనసాగుతున్న తీరుపై సెక్రటేరియట్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జోషి. మొక్కలు నాటడం ఏ విధంగా జరుగుతుందో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీ.ఎస్. సమీక్షించారు. వర్షాలు కురవని చోట.. నాటిన మొక్కలు సంరక్షించేందుకు ఉపాధి హామీ నిధులతో నీటి సప్లై చేయాలని ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates