హరితహారంలో భాగస్వాములమవుతాం : సినీనటి జీవిత

jeevitha1సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో సమావేశం అయ్యారు సినీనటి జీవిత. హరితహారంలో భాగస్వామ్యం విషయంపై చర్చించారు. ప్రియాంక వర్గీస్‌తో సమావేశం ముగిసిన అనంతరం జీవిత మీడియాతో మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొంటామని చెప్పారు. జులై 1న తమ కూతురు శివాని జన్మదినం సందర్భంగా హరితహారంలో పాల్గొని మొక్కలు నాటుతామన్నారు. తమ కుటుంబ సభ్యులమంతా హరితహారంలో భాగస్వాములవుతామని  స్పష్టం చేశారు ఆమె. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు జీవిత.

Posted in Uncategorized

Latest Updates