హరితహారం : ఆగస్టు-1న గజ్వేల్ లో నాల్గవ విడత

నాల్గవ విడత హరితహారానికి ముహుర్తం ఫిక్స్ చేశారు సీఎం కేసీఆర్. ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని డిసైడయ్యారు. ఒకే రోజు ఏకంగా ….లక్షా 116 మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదే విషయంపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్.
ఆగస్టు 1న హరితహారంను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. నాలుగోవిడత హరిత హారంపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. సోంత నియోజకవర్గం గజ్వేల్ లో కార్యాక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. గజ్వేల్ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగించాలని…అలా మోగిన వెంటనే సీఎంతో సహా…అంతా ఒకేసారి మొక్కలు నాటాలన్నారు. ఆ ఒక్క రోజే గజ్వేల్ టౌన్ లో లక్షా 116 మొక్కలు నాటాలని నిర్ణయించారు. వీటికి అదనంగా అదే రోజు అటవీభూముల్లో మరో 20 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.
రోడ్లు, ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల ఆవరణ, గుడి, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాలతో పాటు ప్రతీ ఇంట్లో మొక్కలు నాటాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. దీనికి సంబంధించి మొక్కలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజలకు ఇచ్చే వాటిలో పండ్లు, పూల మొక్కలు కూడా ఉండాలన్నారు.
మనిషి మొక్కల నిష్పత్తిలో మనం చాల వెనుకబడి ఉన్నామన్నారు. కెనడాలో ప్రతీ మనిషికి సగటున 8 వేల 953 చెట్లు, రష్యాలో 4 వేల 465, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లుంటే భారతదేశంలో ఒక్కో మనిషికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఇది వాతావరణ సమతుల్యం దెబ్బతినడానికి ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమౌతుందన్నారు. అందుకే రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం కోసం హరితహారాన్ని తీసుకొచ్చామన్నారు. అటవీ భూముల్లో కూడా పోయిన అడవిని పునరుద్ధరించా

Posted in Uncategorized

Latest Updates