హరితహారం: తుర్కపల్లిలో మొక్కులు నాటిన సీఎం


మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం తుర్కపల్లిలో మొక్కలు నాటారు సీఎం కేసీఆర్. తెలంగాణకు హరితహారం నాలుగోవిడుత కార్యక్రమంలో భాగంగా బుధవారం(ఆగస్టు-1) సిద్ధిపేట గజ్వేల్ లో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలు దేరారు సీఎం. దారి మధ్యలో తుర్కపల్లి, ములుగులో మొక్కలు నాటారు. కేసీఆర్ కు ఎంపీ మల్లారెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. తుర్కపల్లిలో మొక్కలు నాటిన సీఎం…అక్కడి నుంచి గజ్వేల్ కు బయలు దేరారు.

గజ్వేల్ పరిధిలోని ప్రతి ఇంటి ఆవరణలో, రహదారులకు రెండు వైపులా, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రార్ధనామందిరాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ స్థలాలలో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Posted in Uncategorized

Latest Updates