హరితహారం : ప్రతి సిలిండర్ కు మూడు మొక్కలు

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత కార్యక్రమం బుధవారం (ఆగస్టు 1) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు హరితహారంలో మేముసైతం అంటున్నారు LPG డీలర్ల అసోసియేషన్. ఇంటింటికి సిలెండర్ తో పాటు మూడు మొక్కలను అందిస్తున్నారు. వివిధ జిల్లాల్లో LPG డీలర్లు ముందుకు వచ్చి, తమ గ్యాస్ డెలివరీ బాయ్స్ తో సిలెండర్ తో పాటు మొక్కలను వినియోగదారులకు అందిస్తున్నారు. స్వయంగా మొక్కలు ఇంటి దగ్గరికే వస్తుండటంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటికి మొక్కలు పంపిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాటిని నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటామని ఆనందంగా చెబుతున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సిలెండర్ తో పాటు మొక్కల పంపిణీ మొదలైంది. మిగతా జిల్లాల్లో కూడా పౌర సరఫరాలు, అటవీ అధికారులు సమన్యయంతో గ్యాస్ డీలర్లకు మొక్కలు చేరేలా చూడాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు సూచించారు. మొదటి సారిగా చేస్తున్న ఈ ప్రయత్నంలో తొలిరోజు 54 సిలెండర్లను డెలివరీ చేస్తూ.. 150 మొక్కలను వినియోగదారులకు అందించినట్లు వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట భారత్ గ్యాస్ డీలర్ ఆదిరెడ్డి తెలిపారు. హరితహారంలో భాగంగా ఆకు పచ్చని తెలంగాణ సాధనకు తమ వంతు కృషి చేస్తామని  ప్రకటించింది గ్యాస్ డీలర్ల అసోసియేషన్. పర్యావరణం కోసం, మెరుగైన జీవన విధానం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హరితహారం పిలుపులో తాము భాగస్వామ్యం అవుతామని తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates