హరితహారం ప్రపంచానికే ఆదర్శం : కేటీఆర్

KTR Sహరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శమన్నారు మంత్రి కేటీఆర్. సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలనుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం (జూన్-1) మేడ్చల్ జిల్లాలోని ఇన్ఫోసిస్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో పాల్గొన్నారు. హారిత హరం ద్వారా ఐదేళ్లలో 213 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 60 శాతం చెరువుల్లో పుడిక తీశామన్నారు. వరంగల్లో ఇన్ఫోసిస్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు.

హైదరాబాద్ లోని అన్ని చెరువులను దశలవారీగా వాడకంలోకి తీసుకువస్తామని చెప్పిన కేటీర్.. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవే ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. MMTS ను యాదాద్రి వరకు పొడిగిస్తున్నామని.. చెన్నై వాతావరణం, బెంగళూరు ట్రాఫిక్‌తో పోలిస్తే ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ కు ధీటుగా వరంగల్ ఎదుగుతోందన్నారు. వరంగల్‌ లో ఇప్పటికే మహీంద్రా, సీయంట్ ఐటీ సంస్థలు ఉన్నాయని చెప్పిన కేటీఆర్.. ఇన్ఫోసిస్ కూడా ఏర్పాటు చేయాలని కోరుతుమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీవోవో యుబీ ప్రవీణ్ రావ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates