హరితహారం 4వ విడత : మేడ్చల్ జిల్లాకు 47 లక్షల మొక్కలు

HARITHAHARAMతెలంగాణకు మణిహారం..హరితహారం 4వ విడత కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లోని నర్సరీలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కోటి 87 లక్షల మొక్కలు, మేడ్చల్ జిల్లాలోనే 47 లక్షల మొక్కలు నాటబోతున్నామని తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి.

కీసర మండలం రాంపల్లి వద్ద ఉన్న దయారా హరితహారం నర్సరీని గురువారం (జూలై-5) మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నందారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాలు కురియగానే నాలుగో విడత హరితహారంలో భాగంగా ఉద్యమంలా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలను వంద శాతం బతికించే బాధ్యత ప్రతీ ఒక్కరిది అని చెప్పారు. హరితహారం తెలంగాణ రాష్ర్టానికి మణిహారం కావాలన్నారు. రైతుబీమా, రైతుబంధు పథకాలు.. రైతుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు మంత్రి మహేందర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates