హరితహారానికి రండి : గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం

విస్తృత ప్రయోజనాల కోసమే బీసీ జన గణన చేపడతున్నామని గవర్నర్ నరసింహన్ కు వివరించారు సీఎం కేసీఆర్. ఆగస్టు రెండు నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆపీసర్ల పాలన అమలులోకి వస్తుందని చెప్పారు. సోమవారం (జూలై-30) రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసిన కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. గురువారం బుధవారం (ఆగస్టు-1) గజ్వేల్ నుంచి ప్రారంభం కానున్న నాలుగోవిడత హరితహారంలో పాల్గొనాలని గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించారు  సీఎం కేసీఆర్.

ఆగస్టు 15 నుంచి మొదలు కానున్న కంటివెలుగు కార్యక్రమానికి రావాలని కోరారు.  రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన సీఎం పలు విషయాలపై చర్చించారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజన అంశంపై గవర్నర్ తో చర్చించారు సీఎం. హైకోర్టు విభజనపై కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తోందన్నారు. అన్ని విధాల సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. కేంద్రం స్సందించడం లేదన్నారు. తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థలపై విభజన చట్టం మేరకు తెలంగాణ నడుచుకుంటున్నా… ఏపీ వితండవాదం చేస్తోందన్నారు. పదో షెడ్యూల్ సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే వాటికే హక్కు ఉంటుందని … విభజన చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీకి ఇచ్చిన సెక్రటేరియట్, శాసనసభ, శాఖాధిపతుల భవనాలు తిరిగి తెలంగాణకు ఇప్పించాలని గవర్నర్ ను సీఎం  కోరినట్లు తెలుస్తోంది.

బీసీ జనాభా గణన ఉద్దేశాన్ని గవర్నర్ కు సీఎం వివరించారు. రాష్ట్రంలో ఎవక్కువమంది బీసీలే ఉన్నారని … ఇప్పటివరకు  వారి జనాభా తెలియకపోవడంతో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. సమావేశంలో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వం రద్దు అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై హైకోర్టులో జరుగుతున్న వాదనల  వివరాలు గవర్నర్ కు సీఎ వివరించినట్లు సమాచారం. శాసనసభా వర్షాకాల సమావేశాలపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.  ఎంపీ కవిత కూడా గవర్నర్ నరసింహన్ ను కలిశారు. నవంబర్ లో హైదరాబాద్ లో జరుగనున్న భారత స్కౌట్స్ అండ్  గైడ్స్ క్యాంపోరీ కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్ ను ఆహ్వానించారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని వివరించారు. హరితహారంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటారని చెప్పారు కవిత.

Posted in Uncategorized

Latest Updates