హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి: కడియం

భవిష్యత్ తరాల బాగు కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, కోతులు వాపస్ పోవాలంటే హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. సీఎం నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరాలన్నారు.  నాలుగో విడుత హరితహారంలో బాగంగా బుధవారం(ఆగస్టు-1) వరంగల్ అర్భన్ జిల్లా, తిమ్మాపూర్ గ్రామం, బెస్తం చెరువు దగ్గర పది ఎకరాల స్థలంలో మొక్కలు నాటారు కడియం.

ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, కొండా సురేఖ, మహిళ ఫైనాన్స్ చైర్మన్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవా రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ లలితా యాదవ్, కలెక్టర్ ఆమ్రపాలి, పోలీస్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ కమీషనర్ గౌతమ్, ఐఎఫ్ఎస్ అక్బర్, తదితరుల పాల్గొన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates