హరిత సిద్దిపేటగా మారుస్తాం : హరీష్

harishతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే 4వ విడత హరితహారంలో భాగంగా .. సిద్దిపేటను హరిత సిద్దిపేటగా మార్చడానికి సుడా కృషి చేయలన్నారు మంత్రి హరీష్. ఆదివారం (జూలై-8) సిద్దిపేట అర్బన్ డెవలప్‌ మెంట్ అథారిటీ(సుడా), ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన హరీష్.. కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికిహాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆదర్శానికి చిహ్నంగా సిద్దిపేటను మార్చుకుంటున్నామన్నారు. కార్పొరేషన్లకు మాత్రమే అథారిటీ ఉంటుందన్న ఆయన.. వాటి సరసన సిద్దిపేటను నిలిపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ నడి బొడ్డున ఉన్న సిద్దిపేట వేగంగా అభివృద్ధి చెందుతున్నదని.. సిద్దిపేట జిల్లాకు రెండు జాతీయ రహదారులు వస్తున్నాయని వివరించారు.  ప్ర‌జ‌ల‌కు ఎన్ని సౌక‌ర్యాలు ఇచ్చినా త‌క్కువేనన్న ఆయన.. సిద్దిపేట ప్ర‌జ‌లు నిరంత‌ర స‌హ‌కారం అందిస్తున్నారన్నారు. సిద్దిపేట‌లో 500 ఎక‌రాల్లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని. ఇప్ప‌టికే 300 ఎక‌రాల భూమి సేక‌రించినట్లు చెప్పారు. సిద్దిపేట‌లో అండ‌ర్‌ గ్రౌండ్ డ్రైనేజీ మొద‌టి ద‌శ ఫ‌లితం త్వ‌ర‌లో అందుబాటులోకి వ‌స్తున్న‌దని తెలిపారు. ప‌ట్ట‌ణ‌మంతా ప‌చ్చ‌ద‌నంతో హ‌రిత సిద్దిపేట‌గా మార్చ‌డానికి సుడా కృషి చేయాల‌ని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి హ‌రీష్ రావు.

 

Posted in Uncategorized

Latest Updates