హరీశ్ ఎక్కడ పడిపోతారో అని పదేపదే చూశా : గవర్నర్


విద్య ఉన్నచోటే ప్రజలు గౌరవింపబడతారన్నారు రాష్ట్ర గవర్నర్ నరసింహన్. పాఠశాల స్థాయిలోనే జీవితానికి పునాది పడుతుందన్నారు. శనివారం(జూలై-21) కరీంనగర్ వాణినికేతన్ విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న గవర్నర్.. తల్లిదండ్రులు క్రమశిక్షణ పాటిస్తూ…పిల్లలకు నేర్పించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే గురువులకు నిజమైన సంతోషం అని చెప్పారు.

ఇందులో భాగంగానే ఉమ్మడి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఘటనను గుర్తుచేసుకుని నవ్వులు పూయించారు గవర్నర్. బల్లలు ఎక్కిన హరీశ్.. కింద పడతారో లేదో అంటూ పదేపదే చూశానంటూ నవ్వులు పూయించారు. ఎక్కడ ముందుకు పడతాడో అని ఆయన్నే చూడటం జరిగిందన్నారు గవర్నర్. ఆయన మాటల విన్న మంత్రి హరీశ్ కూడా నవ్వుకున్నారు.

పదవులు శాశ్వతం కాదని.. జీవిత విలువలే శాశ్వతమని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. స్కూల్లో వేసే అడుగులే జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయని.. నాడు స్కూళ్లో నేర్చుకున్న విలువలే మమ్మల్నింతటి వాళ్లను చేశాయన్నారు మంత్రి హరీశ్‌రావు.

Posted in Uncategorized

Latest Updates