హరీష్ రావుకు బాల మేధావి శుభాకాంక్షలు


రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచిన నాయకులను ఆయా ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల వారు అభినందనలు తెలిపారు.సన్మానాలు,సత్కారాలు చేశారు. ఇందులో భాగంగానే సిద్ధిపేట ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన హరీష్ రావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన ఇళ్లు..వచ్చి,పోయే వారితో సందడి నెలకొంది. ఈ క్రమంలో భారీ నీటిపారుదల శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాల మేధావి నేహాల్ హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో హరీష్ ను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చిన నేహాల్‌.. హరీష్ రావుకు పుష్పగుచ్ఛం అందించాడు. సంతోషం వ్యక్తం చేసిన హరీష్… నేహాల్‌కు ఆప్యాయంగా స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు. ఈసారి తమ ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని తమ ఊరు పందిళ్లపల్లికి రావాలని హరీష్ ను నేహాల్ కోరాడు. నేహాల్ కోరికను మన్నించిన హరీష్ రావు.. గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates