హరీష్ రావు, కేకేలతో కేటీఆర్ మర్యాదపూర్వక భేటీ

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీ రామారావు… ఆ పార్టీ ముఖ్య నేత ఎమ్మెల్యే హరీష్ రావుతో భేటీ అయ్యారు. హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారు కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ కు.. హరీష్ రావు శుభాకాంక్షలు చెప్పారు.

కేటీఆర్, నేను కలిసి పనిచేస్తాం : హరీష్ రావు

కేటీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని హరీష్ రావు చెప్పారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఉదయాన్నే కేటీఆర్ కు శుభాకాంక్షలు చెప్పానని అన్నారు. భవిష్యత్ లో కేటీఆర్ మరింత పేరు తెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పనిచేయాలని కోరుకుంటున్నాననీ.. కేటీఆర్, తాను ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పారు. “మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశాం. రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా కలిసి పనిచేస్తాం” అన్నారు హరీష్ రావు.

అంతకుముందు.. టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావును ఆయన ఇంటికి వెళ్లి కలిశారు కేటీఆర్. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో.. కేకేతో పార్టీ గురించి కొద్దిసేపు మాట్లాడారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్ కూడా కేటీఆర్ తో నేతలను కలిశారు. ఆ తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడ నేతలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ ఘనంగా స్వాగతం పలికారు.

Posted in Uncategorized

Latest Updates