హరీష్ రావు డబుల్ హ్యాట్రిక్‌ : తెలంగాణలో సరికొత్త రికార్డు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన లీడింగ్, ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. సిద్దిపేట నుంచి ఎవ్వరూ ఊహించనవిధంగా భారీ మెజారిటీతో దూసుకెళ్లారు TRS అభ్యర్థి హరీష్ రావు. లక్షా,19వేల,622 ఓట్ల మెజార్టీ సాధించి, తెలంగాణలో సరికొత్త రికార్డు సృష్టించారు. పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా ఓట్లు హరీష్ రావుకు పోలవ్వడం గ్రేట్.

2004 ఉపఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన హరీశ్‌రావు తర్వాత వరుస విజయాలు సాధిస్తున్నారు. 2008, 2010 ఉపఎన్నికలతోపాటు 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపుతో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించినట్లైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో హరీశ్ రావుకు 1,08,699 ఓట్లు వచ్చాయి.  2004లో చార్మినార్‌ ఎంఐఎం అభ్యర్థికి లక్షా 7 వేల మెజార్టీ వచ్చింది. ఇప్పటివరకూ ఇదే అత్యధికం.

హరీష్ రావు మెజార్టీలు
2004 ఉప ఎన్నిక – 24,594
2008 ఉప ఎన్నిక – 58,000
2009 సాధారణ ఎన్నికలు – 64,667
2010 ఉప ఎన్నిక – 93,858
2014 సాధారణ ఎన్నికలు – 95,328
2018 ఎన్నికలు – 1,19,622

 

 

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates