హర్యానాలో దారుణం : నవవధువుపై రేప్ కి పాల్పడ్డ భర్త, మామ, తాంత్రికులు

హర్యానాలో దారుణం జరిగింది. పెళ్లైన ఓ నవవధువుకి  తొలి రాత్రే కాలరాత్రిగా మారింది. నవవధువుపై భర్తతో పాటు బంధువులు,తాంత్రికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ఘటన జరిగింది.

బాధిత యువతి తండ్రి ఇవాళ(సెప్టెంబర్-29) పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ ప్రకారం…

కురుక్షేత్రలోని యమునానగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో సెప్టెంబర్-12న యువతికి పెళ్లి అయింది. శోభనం గదిలోకి వెళ్లిన యువతిపై.. భర్త,మామ,బావతో పాటు ఆ ఇంట్లో పూజలు చేయడానికి వచ్చిన తాంత్రికులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తర్వాత యువతి సృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదని… యువతి తండ్రికి భర్త సమచారం ఇచ్చాడు. వెంటనే అల్లుడి ఇంటికి చేరుకున్న యువతి తండ్రి అచేతన స్ధితిలో పడి ఉన్న యువతిని గమనించాడు. యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో యువతి తండ్రి కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates