హస్పిటల్ లో రచ్చ చేసిన పేషంట్ తల్లిదండ్రులు : యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేస్తారట

బెంగళూరు : ట్రీట్ మెంట్ కోసం హస్పిటల్ కి తీసుకువచ్చిన తమ కొడుకుకు.. తామే ఆపరేషన్ చేస్తామంటూ నానా రచ్చ చేశారు తల్లిదండ్రులు. సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్ లో తెలుసుకున్నామని, నర్సును, కావాల్సిని పరికరాలు ఇవ్వమని హస్పిటల్ డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగింది.

యువ జంట అనారోగ్యం పాలైన తమ కొడుకుని తీసుకుని హాస్పిటల్ కు వెళ్లారు. బాబుకు ఆపరేషన్ అవసరమని తల్లిదండ్రులే నిర్ధారించి.. తామే సర్జరీ చేసుకుంటామని..  ఒక నర్స్ హెల్ప్ చేస్తే చాలని డాక్టర్లని  కోరారు. వీరి మాటలకు ఒక్కసారిగా హాస్పిటల్ స్టాఫ్ షాక్ కు గురయ్యాయారు.

“మాకు డాక్టర్లపై నమ్మకం లేదు. మేము వారి ఫీజును భరించేస్థాయిలో లేము. యూట్యూబ్ లో వీడియో చూసాం.. మాకు సర్జరీ చేయడం వచ్చు” అని పేషంట్ తల్లిదండ్రులు డాక్టర్లతో గొడవకు దిగారు. ఈ విషయన్ని అక్కడి డాక్టర్ మీడియాతో తెలిపారు. యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేస్తామనడం దారుణమని… ఇలాంటి చర్యలు సమాజానికి మంచివి కావని తెలిపారు. ట్రీట్ మెంట్ చేయడానికి సర్టిఫైడ్ డాక్టర్ అవసరమన్నారు. ఎక్కడో ఓ చోట అధిక ఫీజు వసూలు చేస్తే.. అందరినీ అలాగే చూడటం సరికాదని మీడియాకు తెలిపారు.

ప్రస్తుత రోజుల్లో యూట్యాబ్ లో చూసి వ్యాధిని నిర్ధారంచుకోవడం ప్రజల్లో ఎక్కువైందని.. అది మంచిది కాదని తెలిపారు. అయితే ఆ దంపతుల పేర్లు.. వారి కొడుకుకు వచ్చిన వ్యాధిని గోప్యంగా ఉంచిన డాక్టర్లు..తమ హస్పిటల్ పేరును కూడా బయటికిరానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. వారికి పోలీసులతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపిచినట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates