హాకింగ్ కు తుది వీడ్కోలు… అంతిమయాత్రలో పాల్గొన్న వందలాది అభిమానులు

stedenప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్‌ హాకింగ్‌ కు ప్రజలు తుది వీడ్కోలు పలికారు.76 ఏళ్ల వయసులో మార్చి 14న కేంబ్రిడ్జ్‌లోని ఆయన నివాసంలో హాకింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. లండన్‌ లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ ప్రాంగణంలోని ది గ్రేట్ సెయింట్ మేరీస్ చర్చి దగ్గర శనివారం(మార్చి31) హాకింగ్ అంతిమ యాత్ర జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు దాదాపు 500 మందికిపైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లిల్లీ ఫ్లవర్స్, తెల్ల గులాబీలతో అలంకరించిన హాకింగ్‌ శవపేటికను చర్చి వద్దకు తీసుకొచ్చారు. హాకింగ్ కు చివరిసారిగా నివాళులర్పించేందుకు వందల మంది ప్రజలు రోడ్ల వెంబడి బారులుతీరారు. చర్చి ఒయట గుమికూడిన వందల మంది చప్పట్లతో హాకింగ్ కు తుది వీడ్కోలు పలికారు. తరువాత హాకింగ్ జీవితకాలానికి నిదర్శనంగా 76 సార్లు చర్చిలో గంటలు మోగాయి. అంత్యక్రియలకు ముందు సెయింట్‌ మేరీ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో బ్రిటిష్‌ నటుడు ఎడ్డీ రెడ్‌మేన్‌ తదితరులు ప్రసంగించారు. కేంబ్రిడ్జ్‌ని తమ తండ్రి ఎక్కువగా ఇష్టపడేవారని, అందువలనే ఆయన అంత్యక్రియలు ఇక్కడ నిర్వహించినట్లు హాకింగ్‌ కొడుకు రాబర్ట్‌ టిమ్‌, కూతురు లూసీ తెలిపారు.
h2

Posted in Uncategorized

Latest Updates