హాట్ హాట్ గా నీతిఆయోగ్ మీటింగ్ : కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్న కేసీఆర్

kcr-modiఢిల్లీ రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం హాట్ హాట్ గా జరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న నాలుగో నీతి ఆయోగ్ మీటింగ్ కు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. ప్రధానంగా 6 అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రాల భాగస్వామ్యంతో జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు, విభాగాలు, విధానాలు రూపొందించడమే ప్రధాన లక్ష్యంగా నీతి ఆయోగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ఆయుష్మాన్ భారత్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంద్రధాన్ వంటి ముఖ్యమైన పథకాల పురోగతి, జిల్లాల అభివృద్ధి, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలకు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి కౌన్సిల్ భేటీ కానుంది.

నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభంలో ముందుగా ప్రధాని మోడీ ప్రసంగించారు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తామని…. కో ఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ కు ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్రాలను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు ప్రధాని. ప్రస్తుతం వరదలతో ఇబ్బందిపడుతున్న రాష్ట్రాలకు మరింత సాయం అందిస్తామన్నారు. రాష్ట్రాలన్నీ కలిస్తేనే టీమిండియా నినాదం బలోపేతమవుతుందన్నారు. నీతి ఆయోగ్ తో చారిత్రక మార్పును తీసుకొస్తున్నామన్నారు ప్రధాని. జీఎస్టీ అమలునూ సరళతరం చేస్తామన్నారు.

ఇక నీతి ఆయోగ్ మీటింగ్ లో వివిధ అంశాలను ప్రస్తావించారు సీఎం కేసీఆర్. నీతి ఆయోగ్ కు  ఆహ్వానించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు.  వ్యవసాయం,ఆరోగ్యం,విదేశాంగ విధానం,రక్షణ,ఆర్ధిక రంగాల్లో దేశం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుందన్నారు.  వీటి పరిష్కారానికి రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేయాలని నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు భీమా పధకాన్ని నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో వివరించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో 98 శాతం చిన్న సన్నకారు రైతులున్నారని…. వారిని  ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతుల సంక్షేమం కోసం  తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరారు కేసీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates