మోడీ హామీలు నెరవేర్చలేదు : కేంద్ర మంత్రి రాజీనామా

కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీహార్ లోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP)కి చెందిన ఆయన.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ.. ఆర్ఎల్ఎస్పీకి బీహార్ ఎంపీ సీట్లలో కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయించనుందని తెలియడంతో  ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు.

తమ రాష్ట్ర ప్రజలకు మోడీ ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చిందని అయితే వాటిని అమలు చేయలేకపోయారని ఆరోపించారు. హామీలను నెరవేర్చనందుకు మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో  తెలిపారు. మరోవైపు ఉపేంద్ర కుష్వాహా ఇవాళ(డిసెంబర్ 10) కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు.

 

Posted in Uncategorized

Latest Updates