హాయిరే హాయ్ : 13 నుంచి సమ్మర్ హాలీడేస్

summerఈ నెల 13 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ. తిరిగి జూన్‌ 1న స్కూళ్లు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్కూళ్లల్లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఏప్రిల్-12న చివరి వర్కింగ్ డే కావడంతో ప్రతీ టీచర్ విధులకు తప్పక హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం  ఏప్రిల్‌ 23న చివరి వర్కింగ్ డే కాగా, జూన్‌ 12న తిరిగి ప్రారంభమయ్యేవి. అయితే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం వేసవి సెలవులను ఏప్రిల్‌ 13 నుంచి మే 31 వరకు ఇచ్చింది విద్యాశాఖ.

Posted in Uncategorized

Latest Updates