హార్దిక్ పటేల్ కు రెండేళ్ల జైలు

హార్దిక్ పటేల్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. గుజరాత్ పటీదార్ ఉద్యమం సమయంలో.. 2015లో అల్లర్లు జరిగాయి. విస్ నగర్ లోని బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్ ఆఫీస్ ను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. దీనికి సంబంధించిన కేసులో రెండేళ్ల జైలు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హార్దిక్ తోపాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్ కు కూడా ఇదే శిక్ష పడింది. రూ.50వేల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది కోర్టు. 3వేల మంది ఈ అల్లర్లలో పాల్గొన్నారు. 17 మందిపై కుట్ర, దాడి, అల్లర్ల కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లోనే అరెస్ట్ అయిన హార్దిక్.. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. కొన్ని నెలలు మెహసానా జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు కూడా ఆంక్షలు విధించింది.

కోర్టు తీర్పుకి ముందే.. హార్దిక్ పటేల్ తన మద్దతుదారులతో సమావేశం అయ్యారు. ఎలాంటి ఆందోళనలకు దిగొద్దని సూచించారు. తీర్పు ఏ విధంగా ఉన్నా సంయమనం పాటించాలని తన మద్దతుదారులను కోరారు. కోర్టు శిక్ష విధించటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తీర్పు తర్వాత.. బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు.

Posted in Uncategorized

Latest Updates