హార్ధిక్ పటేల్ : రాహుల్ కు నాయకత్వ లక్షణాలు లేవు

rahulకాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు హర్ధిక్‌ పటేల్‌. తన దృష్టిలో అసలు రాహుల్ నాయకుడే కాదన్నారు. రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలంటూ హర్ధిక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ కు మధ్ధతు తెలిపిన హార్ధిక పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. శుక్రవారం(ఫిబ్రవరి23) ముంబయిలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న హార్ధిక్ పటేల్ మాట్లాడుతూ… ఓ వ్యక్తిగా మాత్రమే రాహుల్‌ గాంధీ నాకు ఇష్టం. అంతేగానీ ఓ నేతగా ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు. అలాగే ఆయన చెప్పేవి పాటించడానికి ఆయనేం నాకు అధిష్ఠానం కూడా కాదు. అయితే అదే కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నా. ఆమెలో నాయకత్వ లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయని నా అభిప్రాయమని హర్ధిక్‌ తెలిపాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాడంటూ వస్తున్న వార్తలపై స్పందించిన హర్ధిక్‌ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తననెవరూ అడ్డుకోలేరని, తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates