హార్లే దేవిడ్‌సన్‌ సూపర్‌‌ బైక్‌పై చీఫ్‌జస్టిస్‌: ఫొటోలు వైరల్‌

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ జస్టిస్‌ బోబ్డే హార్లే డేవిడ్‌సన్‌ సూపర్‌‌ బైక్‌ను డ్రైవ్‌ చేశారు. ప్రస్తుతం నాగ్‌పూర్‌‌లో ఉన్న బోబ్డే ఆ బైక్‌ను ట్రయల్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఫొటోలు సోషల్‌ మీడియాల వైరల్‌ అవుతున్నాయి. 64 ఏళ్ల జస్టిస్‌ బోబ్డేకు బైక్స్‌ అంటే చాలా ఇష్టమని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. గతంలో బుల్లెట్‌ నడిపేవానని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జస్టిస్‌ బాబ్డే హార్లే డేవిడ్‌సన్‌ బండిపైన దిగిన ఫొటోలు నెటింట్లో వైరల్‌ కావడంతో చాలా మంది ఆయన్ను పొగుడుతున్నారు. బార్‌‌ అండ్‌ బెంచ్‌ కూడా ఆ ఫొటోలను ట్వీట్‌ చేసింది. మాస్క్‌ పెట్టుకోకుండా, రూల్స్ పాటించకుండా చీఫ్‌ జస్టిస్‌ బయటకు వెళ్లారంటూ కొంత మంది ట్వీట్‌ చేయడంతో డీలర్‌‌ వివరణ ఇచ్చారు. చీఫ్‌ జస్టిస్‌కు డెమో ఇచ్చేందుకే తానే స్వయంగా ఆయన దగ్గరికి తీసుకొచ్చాని, అప్పటి వరకు మాస్క్‌ పెట్టుకున్న ఆయన బండి ఎక్కుటప్పుడే మాస్క్‌ తీసేశారని డీలర్‌‌ చెప్పారు.

 

Latest Updates