హాలీంకు ఫుల్ గిరాకీ : ఆన్ లైన్ లో ఆర్డర్స్

haleem online ordersరంజాన్ సీజన్ స్టార్ట్ అవడంతో హాలీంకు గిరాకీ పెరిగింది. ఎక్కడ చూసినా హాలీం సెంటర్లే కనిపిస్తున్నాయి. బయటకు వెళ్లి తినలేనివాళ్లు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. అటూ  ఆఫర్స్  ఎక్కువగా ఉండటంతో కస్టమర్స్ అంతా ఆన్ లైన్ లోనే కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కస్టమర్స్.  రంజాన్ నెల వచ్చింది అంటే చాలు హాలీం తినాలని చాలా మంది ఇష్టపడతారు. సూపర్బ్ టేస్ట్ తో పాటు హెల్త్ కి మంచిది కావడంతో హాలీంకు అంతా ఫిదా అవుతారు.

దీన్ని తినేందుకు క్యూ కడుతారు ఫుడ్ లవర్స్.  బిజీ లైఫ్ లో చాలా మంది బయటకు వెళ్లి తినే టైం కూడా దొరకడం లేదు. దీంతో అంతా ఆన్ లైన్ లోనే ఆర్డర్ ఇస్తున్నారు. ఇంటికి తెప్పించుకొని.. ఫ్యామిలీ మెంబెర్స్ తో ఫుల్ గా తినేస్తున్నారు.  ఆన్ లైన్ ఫుడ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. 50 %, 60% ఆఫర్స్ ఉండటంతో .. చాలా మంది ఆన్ లైన్ ఆర్డర్ లోనే బుక్ చేస్తున్నారు. మరి కొంత మంది ఆన్ లైన్ లో హలీంను గిఫ్ట్ గా పంపిస్తున్నారు. చాలా మంది ఆన్ లైన్ లో చికెన్ హలీంనే ఆర్డర్ చేస్తున్నారని చెబుతున్నారు డెలివరీ బాయ్స్. ఎక్కువగా ఐటీ  ఉద్యోగస్తులు, హాస్టల్ లో ఉండేవారి నుంచే ఆర్డర్స్ వస్తున్నాయంటున్నారు.  70 శాతం వరకు ఆన్ లైన్ లోనే వ్యాపారం నడుస్తుందంటున్నారు వ్యాపారులు. ఫుడ్ మంచి టేస్ట్ గా ఉండటం, హోటల్ లో టేబుల్స్ దొరకపోవడంతో ఆన్ లైన్ లో కొంటున్నారని చెబుతున్నారు.  ఆన్ లైన్ వ్యాపారం జోరుగా ఉండటంతో… నష్టపోతున్నామంటున్నారు చిన్న వ్యాపారులు.

Posted in Uncategorized

Latest Updates