హాలీవుడ్ లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది: మైకేల్ కెయిన్

క్యాస్టింగ్ కౌచ్…మనదేశంలోనే కాదు… విదేశాల్లో కూడా ఉందన్నారు..ప్రముఖ అమెరికన్‌ నటుడు, నిర్మాత మైకెల్‌ కెయిన్‌. సినిమాలో అవకాశం రావాలంటే లైంగికంగా సహకరించాలని డిమాండ్‌ చేసే నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌లాంటి వారు తనకు చాలా మంది తెలుసన్నారు. హాలీవుడ్‌లో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ ఉందన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఓ యువతి ఆడిషన్స్‌కు వెళితే …నువ్వు ఇలా చేస్తే అవకాశం ఇస్తాను అని నిర్మాత అంటాడని…ఒక వేళ ఆమె ఒప్పుకోక పోతే… ఈ ప్రాజెక్టులో నువ్వు లేవని నిర్మాత చెబుతాడన్నారు.

నిర్మాతకు లైంగికంగా సహకరించలేదన్న కారణంతో నైపుణ్యం ఉన్న ఓ నటికి అవకాశం ఇవ్వకుండా చేయడం నిజంగా ఘోరమైన విషయమన్నాడు మైకేల్. ఇది ఉన్నదనే విషయం తెలిసినా తానొక్కడినే ఏమీ చేయలేనన్నాడు.

Posted in Uncategorized

Latest Updates