హాస్టల్ లో విద్యార్థులపై పోకిరీల దాడి..పట్టించుకోని అధికారులు

పెద్దపల్లి జిల్లా కేంద్రం ప్రగతి నగర్ బీసీ కాలనీలోని  బాలుర హాస్టల్ లో 9వ తరగతి చదువుకుంటున్న గిరిజన విద్యార్థులను కొంతమంది పోకిరీలు కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం (జూలై-13) రాత్రి కొంతమంది యువకులు హాస్టల్  గదిలోకి చొరబడి.. ఇష్టమొచ్చినట్లు  విద్యార్థులను చితకబాదారు.

 

దెబ్బలకు తట్టుకోలేక  స్టూడెంట్స్ ఏడుస్తుంటే ..  శబ్దం బయటకు వినపడొద్దంటూ బెదిరించారు పోకిరీలు. ఆ రాత్రంతా భయంతో  బిక్కుబిక్కుమంటూ ఏడుస్తు నిద్రపోకుండ కూర్చున్నారు ఎనిమిది మంది విద్యార్థులు. వార్డెన్ రాజన్న అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి, చెప్పారు విద్యార్థులు. దీంతో పేరెంట్స్ వచ్చి హాస్టల్ వార్డెన్ ను పిలిపించి విషయం తెలియజేశారు. వార్డెన్ విషయాన్ని పై అధికారులకు వివరించారు. అయితే ఈ ఘటన బయటకు రాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రలను వార్డెన్ ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శనివారం(జూలై-14) పేరెంట్స్  వెళ్లిపోయాక… మళ్లీ ఆ పోకీరీలు తమను చంపేస్తామంటూ బెదిరించినట్లు చెబుతున్నారు విద్యార్థులు. కొట్టినవారిలో సాయి అనే వ్యక్తిని గుర్తుపట్టిన విద్యార్థులు వార్డెన్ కి చెప్పినా.. పోలీలకు ఫిర్యాదు చేయాలేదంటున్నారు.  తమ పిల్లలను కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు పేరెంట్స్ .

 

 

Posted in Uncategorized

Latest Updates