హాస్పిటల్ నుంచి గోవా సీఎం డిశ్చార్జ్

ఢిల్లీ : గోవా సీఎం మనోహర్‌ పారికర్‌  హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం పారికర్ ను హాస్పటల్ నుంచి డిశ్చార్జి చేశామని ఎయిమ్స్‌ అధికారి వెల్లడించారు. ఆదివారం రాత్రికి ఆయన గోవా చేరుకుంటారని పారికర్‌ సన్నిహితులు తెలిపారు. పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ తో నెల రోజుల నుంచి ఎయిమ్స్‌ లో చికిత్స పొందుతున్న పారికర్.. ఏడు నెలలుగా, ముంబై, న్యూయార్క్‌, న్యూఢిల్లీలోని హస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నారు.

దీర్ఘకాలంగా అస్వస్ధతతో బాధపడుతున్న పారికర్‌ సీఎం పదవి నుంచి వైదొలగాలని విపక్ష కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే (అక్టోబర్-12)న ఎయిమ్స్‌ లోనే ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కేబినెట్‌ మంత్రులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పారికర్ కోలుకోవడంతో సీఎంగా ఆయనే కొనసాగే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు.

 

Posted in Uncategorized

Latest Updates